ఔరా.. పెళ్లి దుస్తుల్లోనే మార్షల్ ఆర్ట్స్
చెన్నై: అమ్మాయిలు పెళ్లి అవుతుందంటే సిగ్గుపడుతుంటారు. తాళి కట్టించుకునేంత వరకు మౌనంగా తలవంచుకుని ఉంటారు. కాని ఒక పెళ్లి కూతురు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను పెళ్లి కూతురు దుస్తుల్లోనే ప్రదర్శించి ఔరా అనిపించుకున్నది.
తమిళనాడుకు చెందిన నవ వధువు కత్తి, కర్రసాము ప్రదర్శించి శెహభాష్ అనేలా అదరగొట్టింది.
తిరుకోలూరు గ్రామానికి చెందిన నిషా (22) రాజ్ కుమార్ అనే యువకుడిని వివాహం చేసుకున్నది. తాళి కట్టించుకున్న తరువాత జరిగిన ఊరేగింపులో నిషా తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించింది. పెళ్లి కూతురు దుస్తుల్లోనే తను నేర్చుకున్న వాటిని ప్రదర్శించి బంధువులు, స్నేహితులను అబ్బురపరిచింది. ఈ వీడియో తమిళనాడులో వైరల్ అయ్యింది.