మరో నటీమణిని ఆదుకున్న మాధురి దీక్షిత్

బుల్లి తెరపై మూడు దశాబ్ధాల పాటు అనేక పాత్రలలో నటించి, మహిళాభిమానులను మెప్పించిన షాగుఫ్తా అలీ కొద్ది రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది.
వైద్యానికి డబ్బులు లేక అల్లాడుతున్నది. తనను ఆదుకోవాల్సిందిగా నటుడు సోనూసూద్ ను కూడా ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

నటీనటులకు సాయం చేయడం లేదని సోనూసూద్ తేల్చి చెప్పడంతో వెనక్కి వచ్చేసింది. తాజాగా హిందీ టివిలో ప్రసారం అయ్యే డ్యాన్స్ దివానే షో కి హాజరై, తన కష్టాలను చెప్పుకున్నది. పాతిక సంవత్సరాలుగా టివి రంగంలో పాత్రలు చేసి కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. డయాబెటిక్ కారణంగా నా ఆరోగ్యం క్షీణించిం కాళ్లు సరిగా పనిచేయడం లేదు. కంటి చూపు మందగించిందిని కన్నీటి పర్యంతమైంది. జడ్జి స్థానంలో ఉన్న నటీమణి మాధురి దీక్షిత్ ఆమెను ఓదార్చారు. ఇలాంటి దుస్థితిలో మిమ్మల్ని ఆదుకోవడానికి డ్యాన్స్ దివానే టీమ్ ముందుకు వచ్చిందని తెలిపింది. టీమ్ తరఫున మీకు రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని మాధురి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.