శని, ఆదివారం కేరళలో లాక్ డౌన్

తిరువనంతపురం: డెల్టా, జీకా వైరస్ కేసులు పెరుగుతుండడంతో కేరళ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు శని, ఆదివారం నాడు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లుప రకటించింది.
ప్రస్తుతం కేరళలో 14వేలకు పైగా కేసులు నమోదు కావడం, దేశంలో తొలిసారి కరోనా వైరస్ సోకిన వైద్యురాలికి మళ్లీ పాజిటివ్ నిర్థారణ కావడంతో అప్రమత్తమైంది. జీకా వైరస్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళనకు దారి తీసింది. కేసులను అదుపులోకి తెచ్చేందుకు లాక్ డౌన్ మినహా మరోమార్గం లేదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కూడా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

దేశంలో పెరుగుతున్న కేసులు…
దేశంలో మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతం రోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. వీటితో మొత్తం కేసులు 3.09కోట్లకు చేరగా నిన్న 624 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,11,408 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 4,29,946 మంది కరోనా తో బాధపడుతున్నారు. మంగళవారం నాడు 41వేల మంది వైరస్‌ నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 3,01,04,720(97.28 శాతం)కి చేరాయి. న్యూఢిల్లీలో వ్యాక్సిన్లు ఇవాల్టితో అయిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యాక్సిన్లు సరఫరా చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది.

Leave A Reply

Your email address will not be published.