విశాఖలో పివి.సింధు అకాడెమీకి భూమి అప్పగింత
విశాఖపట్నం: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు కు నగరంలోని తోట గరువులో ప్రభుత్వ స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలం హద్దులు నిర్ణయిస్తూ రెవెన్యూ అధికారులు స్థలం అప్పగించారు.
విశాఖ రూరల్ చినగదిలి మండలం పరిధిలో 73/11, 83/5, 6 సర్వే నెంబర్లలో 2 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించినట్లు తహసిల్దార్ ఆర్.నర్సింహమూర్తి తెలిపారు. మండల సర్వేయర్ తో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించామన్నారు. అకాడెమీ ఏర్పాటు చేసుకునేందుకు స్థలం సిద్ధంగా ఉందన్నారు. పనులు ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చని తహసిల్దార్ తెలిపారు. స్థలం హద్దుల మ్యాప్, అప్పగింత డాక్యుమెంట్లను పివి.సింధు అకాడెమీ ప్రతినిధులకు అందచేశారు.