కేంద్రం చేతుల్లోకి కృష్ణా, గోదావరి జలాలు

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్ని కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు పరిధిలోకి.. కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి తెచ్చింది.  అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని స్పష్టం చేసింది.  బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటారని తెలిపింది. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయి. ఇందుకోసం ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఆదేశించింది. సీడ్ మనీ కింద 60 రోజుల్లో డిపాజిట్ చేయాలని,  నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్ర జల్‍శక్తి శాఖ గెజిట్ లో స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.