ఇన్ స్టాగ్రామ్ ను ఊపేస్తున్న సింగర్

కేవలం రెండు గంటల్లో వన్ మిలియన్ ఫాలోయర్స్ మార్క్ క్రాస్ చేసి ఒక సింగర్ రికార్డు సృష్టించాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. ఆయనే కొరియన్ సింగర్ టెయిల్.
కొరియన్ సింగర్స్ కొత్త కొత్త బాణీలతో ప్రపంచ మ్యూజిక్ ను ఏలుతున్నారు. ఇప్పటి వరకు మనం బిటిఎస్ గురించి విన్నాం. సౌత్ కొరియన్ పాప్ బ్యాండ్ అయిన బిటిఎస్ యువతను మత్తెక్కిస్తున్నది. దాని వెనకాలే ఎన్.సి.టి వచ్చేసింది. ఇది కూడా కె పాప్ సింగర్స్ తో కూడుకున్న మ్యూజిక్ బ్యాండ్ కావడం విశేషం. ఎన్.సి.టి మ్యూజిక్ బ్యాండ్ లో సింగర్ టెయిల్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు.

టెయిల్ తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లో తన ఖాతా తెరిచాడు. ఇంకేముంది వరదలా ఫ్యాన్స్ ఫాలో అయ్యారు. కేవలం గంటా నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ఒక మిలియన్ ఫాలోయర్స్ ను సంపాదించుకుని చరిత్ర సృష్టించాడు. తన పేరున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ప్రపంచ రికార్డు నమోదు అయినందుకు టెయిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంతగా అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేసి, ప్రతి ఒక్క ఫాలోయర్ కు ధన్యవాదాలు చెప్పాడు.

Leave A Reply

Your email address will not be published.