పుట్టిన రోజున మొక్క నాటిన కెసిఆర్ మనవడు
హైదరాబాద్: సిఎం కెసిఆర్ మనవడు కె.హిమాన్షు రావు తన పుట్టిన రోజు సందర్భంగా బేగంపేటలోని ప్రగతి భవన్ లో మొక్క నాటారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కకు నీళ్లు పోశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయిన మొక్కులు నాటాలని హిమాన్షు కోరారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అన్నారు. హిమాన్షు దత్తత తీసుకున్న రెండు గ్రామాల్లో కల్తీ లేని ఆహారం వంటి గొప్ప కార్యక్రమం ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీస్సులు ఇస్తున్నట్లు సంతోష్ తెలిపారు.