కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా
కరీంనగర్: పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు, హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టిఆర్ఎస్ టికెట్ తనదేనంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అయిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టిఆర్ఎస్ టికెట్ తనదేనంటూ ఒక నాయకుడితో మాట్లాడిన మాటలు వైరల్ కావడంతో పిసిసి క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షోకాజు నోటీసుకు సమాధానం ఇచ్చే బదులు పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.