జేఈఈ మెయిన్స్ కొత్త తేదీల వెల్లడి
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ మెయిన్స్ పరీక్షల కోసం కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. జులై 20- 25 వరకు మూడో ఎడిషన్, జులై 27- ఆగస్టు 2 మధ్య నాలుగో ఎడిషన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నాలుగు సార్లు పరీక్షను నిర్వహించనున్నట్లు పోఖ్రియాల్ వెల్లడించారు. దీనివల్ల విద్యార్థులు తమ ర్యాంకులను మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మార్చిలో మెయిన్స్ రెండో దశ జరగాల్సిఉండగా.. తదుపరి ఎడిషన్లు ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉందన్నారు. జులై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సైతం వాయిదా పడిందని మంత్రి రమేష్ తెలిపారు.