వీర జవాన్ కు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా

గుంటూరు: కాశ్మీర్ లోని రాజౌరి జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ జశ్వంత్ రెడ్డి (23) అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి.
బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, స్నేహితులు అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పాల్గొని జై జవాన్ అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, డిప్యుటీ స్పీకర్ కోన రఘుపతి జశ్వంత్ రెడ్డి మృతదేహంపై పుష్ఫగుచ్చం పెట్టి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును తల్లిదండ్రులకు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా ఉంటాని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సుచరిత తెలిపారు. అంతిమ యాత్రలో జిల్ల కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పి విశాల్ గున్ని పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.