జగన్ బెయిల్ రద్దు కేసు 14కు వాయిదా
హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో దోషిగా ఉన్న సిఎం వైఎస్.జగన్ సాక్షులను, విచారణ సంస్థలను ప్రభావితం చేస్తున్నందున ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని రఘురామ తోపాటు జగన్, సిబిఐ ని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 1వ తేదీన ఆదేశించింది. జగన్, రఘురామ తమ లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. కాని సిబిఐ మాత్రం లిఖిత పూర్వక వాదనలు సమర్పించబోమని న్యాయమూర్తికి చెప్పింది. తదుపరి విచారణ ను ఈ నెల 14వ తేదీకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వాయిదా వేసింది.