రెండు వారాల పాటు విస్తారంగా వర్షాలు

అమరావతి: నైరుతి రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. వచ్చే 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా  మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.