యుఎస్ ఏయిర్ పోర్టుల్లో పెరిగిన ప్రయాణీకులు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా పలు దేశాలు వణికిపోతున్నాయి. విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసి, ఆ తరువాత ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఏడాది తరువాత అమెరికా విమానాశ్రయాల్లో ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. దేశీయంగా ప్రయాణించేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తండడంతో సందడి సందడిగా మారింది.

ఆదివారం అన్ని విమానాశ్రయాల్లో 22 లక్షల మంది కి పైగా స్క్రీనింగ్ జరిగింది. గత ఏడాది మార్చి తరువాత ఇంతస్థాయిలో ప్రయాణీకులు రావడం ఇదే ప్రథమమని ఏయిర్ పోర్టు అథారిటీ వెల్లడించింది. దేశీయ ప్రయాణాలు పెరిగినప్పటికీ అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగితే తప్ప విమానయాన సంస్థలకు లాభాలు ఉండవు. పలు దేశాలతో పాటు అమెరికాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడం అంతర్జాతీయ విమానయానానికి శాపంగా పరిణమించింది. రోజు వారీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే గత రెండు వారాల్లో మళ్లీ కేసులు రెట్టింపు కావడం అధికారులను కలవర పెడుతున్నది.

 

Leave A Reply

Your email address will not be published.