ముంబయి, జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ.105
న్యూఢిల్లీ: దేశంలో రెండో రోజుల విరామం అనంతరం పెట్రోల్ రేట్లు శుక్రవారం మరోసారి ఎగబాకాయి. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు చేరగా.. తాజాగా 35 పైసలు పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ రూ.105.24, డీజిల్ రూ.96.72కు చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం రూ.99.16, డీజిల్ రూ.89.15 పలుకుతోంది. దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 మార్క్ ను దాటింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వంద మార్క్ ను దాటడంతో వాహనదారులు బేజారెత్తిపోతున్నారు. డీజిల్ రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్లోని పలు రాష్ట్రాల్లో డీజిల్ రూ.100 దాటింది. మే 4వ తర్వాత ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు వరుసగా 33వ సార్లు పెరిగాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు…
కోల్కతా పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ.92.03
చెన్నైలో పెట్రోల్ రూ.100.13, డీజిల్ రూ.93.72
బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ రూ.94.54
హైదరాబాద్లో పెట్రోల్ రూ.103.05, డీజిల్ రూ.97.20
విజయవాడలో పెట్రోల్ రూ.105.17, డీజిల్ రూ.98.73
తిరువనంతపురంలో పెట్రోల్ రూ.101.14, డీజిల్ రూ.95.74
జైపూర్లో రూ.105.91.. డీజిల్ రూ.98.29
పాట్నాలో పెట్రోల్ రూ.101.21, డీజిల్ రూ.94.52
భోపాల్లో రూ.107.43, డీజిల్ రూ.97.93
శ్రీనగర్లో పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.92.80