ఫ్యాన్స్ కు సారీ చెప్పిన హీరో

అభిమానులంటే సినిమా స్టార్స్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. తమ అభిమానులకు నచ్చే విధంగా సినిమాల్లో నటించి మెప్పిస్తారు. కొన్ని సందర్భాల్లో హర్ట్ అయితే సారీ చెప్పేందుకు కూడా వెనకాడరు.

హీరో వెంకటేశ్ కూడా అదే పని చేశారు. భారీ అంచనాలతో నారప్ప సినిమాను తెరకెక్కించారు. సినిమా థియేటర్లలో విడుదల చేస్తారని అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాని ఒటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజు చేస్తున్నారు. అంత పెద్ద హీరో సినిమాను ఒటిటిలో విడుదల చేయడంపై అభిమానులు రుసరుసలాడుతున్నారు. ఈ విషయం హీరో వెంకటేశ్ చెవిలో పడగానే, తన అభిమానులకు సారీ చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా నారప్ప సినిమాను ఒటిటిలో రిలీజు చేయక తప్పడం లేదన్నారు. తన అభిమానులందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని వెంకటేశ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.