పోలీసు ఉద్యోగి కూతురుకు వేధింపులు
గుంటూరు: తాడేపల్లి మండలం లో మహిళలపై అకృత్యాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు ఘటనలు జరుగగా, తాజాగా కొలనుకొండ గ్రామంలో మైనర్ బాలికపై ఐదుగురు యువకుల వేధింపులకు పాల్పడ్డారు.
సాక్షాత్తు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి కుమార్తెను స్థానిక యువకులు వేధింపులకు పాల్పడ్డారు. బాలిక తండ్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రభుదేవా, క్రాంతి, ఆనంద్ బాబు, రోశయ్య, తేజ లపై ఫిర్యాదు చేశారు. ఈ అయిదుగురు వ్యక్తుల పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. రెండు వారాలు అవుతున్నా సీతానగరంలో యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల ఆచూకి దొరకలేదు.