బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నది. తమిళనాడు ప్రభుత్వ బస్సులలో ప్రయాణించే మహిళలలకు ఉచిత టికెట్లు ఇవ్వనున్నారు.

వీరితో పాటు హిజ్రాలు, దివ్యాంగులు, వారి సహాయకులకు ఒకరికి ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత బస్సులలో ఉచితం ప్రయాణం చేసే ఫైలుపై సంతకం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అధికారులు ఈరోజు నుంచి ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఏయే మార్గాల్లో ఎంత మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు టిక్కెట్లు కూడా ఇవ్వనున్నారు. స్టాలిన్ నిర్ణయం పై మహిళలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.