హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపిఎస్?
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఢీకొట్టే అభ్యర్థి కోసం కొన్ని రోజులుగా సిఎం కెసిఆర్ వడపోత చేస్తున్నా లభ్యం కావడం లేదు.
ఇవాళ ఐపిఎస్ ఉద్యోగానికి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు, అనుమతివ్వాలని ప్రధాన కార్యదర్శికి తన రాజీనామాను పంపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో సంచలనంగా మారింది.
టిఆర్ఎస్ తరఫున బరిలో ఉంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారు చేశారా లేదా దళిత బంధు పథకం కోసం నియమిస్తారా అనేది తెలియడం లేదు. టికెట్ ఇవ్వనట్లయితే దళిత బంధు పథకం బాధ్యతలు కెసిఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఎన్నికల ఎఫెక్ట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.