ముగ్గురి ఆడపిల్లలకు ఉరేసి తల్లి బలవన్మరణం
చౌటుప్పల్: రాంనగర్ లో ఒక తల్లి తన ముగ్గురు ఆడ పిల్లలకు ఉరేసి తను బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు అమ్మాయిలు చనిపోగా, ఉరి జారడంతో ఒక అమ్మాయి మృత్యువు నుంచి బయటపడింది.
ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకున్నది. ఇవాళ ఉదయం ఈ ఘటన గురించి ఇరుగు పొరుగువారికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొర్పునూరి ఉమారాణి (32) కు ముగ్గురు అమ్మాయిలే పుట్టారు. ఆర్థిక సమస్యలతో ఆమె బుధవారం రాత్రి కుమార్తెలు హర్షిణీ (14), లక్కీ (10), షైని (8) లకు తొలుత ఉరేసింది. వారు చనిపోయారని నిర్థారించుకున్న తరువాత తను కూడా ఉరేసుకుని చనిపోయింది. అయితే ఆ ముగ్గురి లో శైని మృత్యువు నుంచి బయటపడింది. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించగా బతికి ఉండడంతో వెంటనే ఆసుపత్రికి పంపించి ప్రాథమిక చికిత్స చేయిస్తన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.