దరిద్రుడా… నీకు సరైన శిక్ష వేశారు!
ముంబయి: కని పెంచిన తల్లి అనే మానవత్వం లేకుండా ఆమె పట్ల మృగంలా ప్రవర్తించిన కుమారుడికి జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ ఘటన కోల్హాపూర్ లో జరిగింది.
కొల్హాపూర్ కు చెందిన సునీల్ 2017 ఆగస్టు 28న తన తల్లితో గొడవ పడ్డాడు. గొడవ పెరిగి పెద్దది కావడంతో సొంత తల్లి అనేది చూడకుండా చంపేశాడు. ఆమె శరీరంలోని ముఖ్య భాగాలపై ఉప్పూ కారం వేశాడు.
ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చారు. ఈలోపే వంట గదిలో కూర్చుని తల్లి శరీర భాగాలను తింటూ కూర్చున్నాడు. అతన్ని చూసి పోలీసులే కంగుతిన్నారు. తన తల్లిని తనే చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వాదప్రతివాదనలు విన్న జిల్లా కోర్టు ఇవాళ తుది తీర్పు నిచ్చింది. తల్లి అని చూడకుండా చంపేసి, ఆపై వండుకుని తిన్న సునీల్ కు ఉరిశిక్ష విధించింది. సునీల్ మద్యం తాగితే విపరీతంగా ప్రవర్తిస్తాడని, అతన్ని ఎవరూ అదుపు చేయలేరని బంధువులు కూడా కోర్టులో తెలిపారు. జిల్లా కోర్టు కఠిన తీర్పుపై గ్రామ ప్రజలు హర్ష్యం వ్యక్తం చేశారు.