యూరో కప్ గెలుపొందిన ఇటలీ
లండన్: యూరో కప్ ఫుట్ బాల్ ఛాంపియన్ గా ఇటలీ నిలిచింది. 1968 తరువాత మళ్లీ కప్ ను కైవసం చేసుకుని కీర్తి పతాక ఎగురవేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మెగా టోర్నిలో విఫలమవుతున్న టీమ్ కు ఈ విజయంతో స్వాంతనన లభించింది.
లండన్ వేదికగా యురోపియన్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఫైనల మ్యాచ్ కావడంతో వెంబ్లే స్టేడియం కిక్కిరిసింది.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఇంగ్లండ్, ఇటలీ జట్లు 1-1 తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లండ్ రెండు గోల్స్ చేసింది. ఇంగ్లండ్ కూడా సుధీర్ఘ కాలం 55 ఏళ్ల తరువాత ఫైనల్ కు వచ్చినప్పటికీ కప్ దక్కలేదు. విజేతగా ఇటలీ నిలిచింది. పెనాల్టీ షూటౌట్ లో గోల్ కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకుని ఇటలీ గెలిచేలా మలుపు తిప్పాడు.