అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్

రంగారెడ్డి: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నరు. జోహెన్స్ బర్గ్ నుంచి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఒక ప్రయాణీకుడు దగ్గర రూ.25 కోట్ల విలువచేసే 3.2 కేజీల హెరాయిన్ ను పట్టుకున్నారు.

మలద్వారం గుండా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హెరాయిన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బంగారం తో పాటు హెరాయిన్ ను పెద్ద ఎత్తున తీసుకువస్తూ పలువురు పట్టుబడుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసేవి పట్టుబడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా స్మగ్లింగ్ కు పాల్పడుతునే ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.