ఒటిటి… రిలీజు పై తొందర వద్దు…

హైదరాబాద్: కరోనా మహమ్మారితో ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో పలువురు నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలను ఒటిటి ఫ్లాట్ ఫామ్ పై రిలీజు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఈ తరుణంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరిగింది. నటుడు మురళీ మోహన్ మాగంటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు, థియేటర్లు తెరిచే వరకు ఒటిటిలో సినిమాలు విడుదల చేయరాదని తీర్మానం చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు వేచి చూడాలని, అప్పటికీ థియేటర్లు తెరుచుకోనట్లయితే ఎవరి ఇస్టప్రకారం వారు ముందుకు వెళ్లవచ్చన్నారు. తమ నిర్ణయాన్ని ఎవరైనా ధిక్కరించే సినిమాలను విడుదల చేసినట్లయితే ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.