డొనాల్డ్ ట్రంప్ గెట్టర్ వచ్చింది
వాషింగ్టన్: ప్రపంచంలో ఫేస్ బుక్, ట్విటర్ కు పోటీగా మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వచ్చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని తీసుకువచ్చారు.
దాని పేరే గెట్టర్ (GETTR). త్వరలోనే ఫేస్ బుక్, ట్విటర్ కు ధీటుగా మరొక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను తీసుకువస్తానని ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన కొత్త వేదికను తీసుకురావడమే కాకుండా అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ భావ ప్రకటనలకు స్వేచ్ఛ ఉంటుందని, ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనలో అమెరికాలో ఆయన అభిమానులు, రిపబ్లికన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారంటూ ట్రంప్ ఖాతాలను ఫేస్ బుక్ తో పాటు ట్విటర్ నిషేధించిన విషయం తెలిసిందే. ఒక్క ట్విటర్ లోనే ట్రంప్ కు 88.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో పాటు ఆయనకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కూడా మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారు.