రష్యాను ఠారెత్తిస్తున్న డెల్టా వేరియంట్

మాస్కో: కరోనా వైరస్ లో డెల్టా వేరియంట్ అంటేనే హడలిపోతున్నారు. రష్యా లో డెల్టా వేరియంట్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు నమోదు కాగా 669 మంది చనిపోయారు.

ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడమే కాకుండా చనిపోవడం కూడా తొలిసారి అని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. గత శుక్రవారం యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ డెల్టా వేరియంట్ కు హాట్ స్పాట్ గా మారింది. ఇక్కడ మరణాలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాజధాని నగరం మాస్కోలో కూడా పరిస్థితులు దిగజారడంతో ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తున్నది. నగరంలో నమోదు అవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వైరస్ తోనే వస్తున్నాయని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కు దూరంగా ఉన్నవారు వేయించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. చాలా మంది వేయించుకునేందుకు వెనకాడుతున్నారని, రకరకాల అనుమానాలతో వేయించుకోకపోతే ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. తను కూడా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వేసుకున్న విషయాన్ని పుతిన్ గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.