షోరూమ్ బైక్ తో చెక్కేసిన జంట

చండీగఢ్: జలంధర్ లోని శివ ఆటో డీల్ షోరూమ్ కు ఒక జంట వచ్చింది. పల్సర్ బైక్ కొనేందుకు వచ్చామని చెప్పగా షోరూమ్ సిబ్బంది వారికి మోడళ్లను చూపించారు. టెస్టు డ్రైవింగ్ పేరు తో కొత్త బైక్ తో ఉడాయించారు. ఈ ఘటనతో షోరూమ్ సిబ్బంది కంగుతిన్నారు.

టెస్టు డ్రైవింగ్ కోసం టూ వీలర్ తీసుకువెళ్లిన జంట ఇంకా రాకపోవడంతో సిబ్బంది కంగారుపడ్డారు. ఎంతకు తిరిగి రాకపోవడంతో సిబ్బంది సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యదు చేశారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా జంట ఎక్కడకు వెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు. వారు తీసుకువెళ్లిన బైక్ ఫొటోలను సమీపంలోని పోలీసు స్టేషన్ కు పంపించి అప్రమత్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.