కోర్టు ఆవరణలోనే మత మార్పిడి, ఆపై నిఖా

న్యూఢిల్లీ: ఒక అడ్వకేట్ హిందూ అమ్మాయిపై కన్నేసి ఆపై మతం మార్పించి కోర్టు ఆవరణలోని తన ఛాంబర్ లో నిఖా చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తండ్రి వెంటనే పోలీసు స్టేషన్, బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాడు.

కడ్ కడ్ కుమా కోర్టులో ఇక్బాల్ మాలిక్ అడ్వకేట్ గా కేసులను వాదిస్తుంటాడు. ఒక హిందూ అమ్మాయి పై కన్నేసి తొలుత మతం మార్పించాడు. ఆపై ఆమెను కోర్టులోని తన ఛాంబర్ లోనే నిఖా చేసుకున్నాడు. ఈ వ్యవహారం తెలిసిన తండ్రి వెంటనే ఢిల్లీ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయగా అతడికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. న్యాయవాదిగా ప్రాక్టీసు చేయకుండా సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. నిఖా కు కోర్టు ప్రాంగణాన్ని వినియోగించినందుకు సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులో ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ, విశ్వసనీయతను కాపాడేందుకు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక క్రమశిక్షణా కమిటీని బార్ కౌన్సిల్ నియమించింది. పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.