మోదీ తెల్లగడ్డం సాగుపై శశిథరూర్ సెటైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తెల్ల గడ్డాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ కొత్త పదాన్ని ప్రయోగించారు. పొగొనోట్రోఫి అనే పదం మోదీకి చక్కగా సరిపోతుందని థరూర్ ట్వీట్ చేశారు.
పొగనోట్రోఫి అంటే గడ్డడ పెంచడమన్నారు. ఈ పదం గురించి తెలియచేసేందుకు మోదీని ఉదాహరణగా తీసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత నరేంద్ర మోదీ గడ్డం పెంచుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నర కాలంగా ఆయన సన్యాసుల మాదిరి తెల్లగడ్డంతో దర్శనం ఇస్తున్నారు. పొగొనోట్రోఫి అంటే మోదీ మాదిరి గడ్డం సాగు చేయడమన్నారు. ఈ కొత్త పదాన్ని తన మిత్రుడు రితిన్ రాయ్ చెప్పారని శశిథరూర్ వెల్లడించారు.