12 ఏళ్ల పిల్లలకు కండోమ్ లు!

చికాగో: సెక్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఐదో తరగతి విద్యార్థులకు (12 ఏళ్ల లోపు) కండోమ్స్ అందుబాటులో పెట్టాలనే విధానంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆ వయస్సులో సెక్స్ అంటే కూడా తెలియని స్థితిలో ఉంటారని, వారికి ఇలాంటివి నేర్పించడమేంటని తల్లిదండ్రులు వాదిస్తున్నారు.

చికాగో ఎడ్యుకేషన్ బోర్డు సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ ని తీసుకువచ్చింది. ఐదు, ఆ పై తరగతల విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వాలని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ విధానం ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లో 250, హైస్కూళ్లలో ఒక వేయి వరకు కండోమ్స్ ఎప్పుడూ అందుబాటులో పెట్టాలని సూచించింది. ఇవి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. విద్యార్థుల్లో లైంగిక వాంఛలు, వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకు ఈ విధానం తీసుకువచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ విధానాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్న పిల్లలకు ఇది నేర్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాని వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం ఈ విధానం సరైందేనని, ఇందులో తప్పేమి లేదని సూచిస్తున్నారు. ఆరోగ్యకర సెక్స్ కోసం నిర్ణయాలు తీసుకునేందుకు స్పష్టమైన సమాచారం తెలుసుకునే హక్కు విద్యార్థులకు ఉందని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.