ఇంటి పన్నులు బకాయిలు చెల్లించిన సిఎం
తాడేపల్లి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన నివాసానికి సంబంధించి 2019 నుంచి ఇంటి పన్ను చెల్లించడం లేదు. దీంతో ఆయన పన్ను బకాయిలు రూ.16.90 లక్షలు పేరుకుపోయాయి.
జగన్ బకాయిలు పడ్డారంటూ పత్రికలో కథనం రావడంతో ఆయన ఆఘమేఘాల మీద స్పందించారు. సకాలంలో కట్టకపోవడంతో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫెనాల్టీ కూడా విధించారు. శుక్రవారం నాడు సిఎం జగన్ తరఫు వ్యక్తులు రూ.16.90 లక్షలు చెక్కు రూపంలో చెల్లించి రశీదు తీసుకున్నారు. ఈ ఇళ్లు జగన్ తన సతీమణి భారతి పేరుతో నిర్మాణం చేశారు.