రాత్రి తిరిగితే రేప్ చేయరా!: మతాధికారి వ్యాఖ్యలు
తిరువనంతపురం: ఆయన కట్టుబొట్టు, వాలకం చూస్తే చిన్న పిల్లాడు అనుకుంటారు. కాని ఆయన పెద్దవాడు. పైగా ముస్లిం మతపెద్ద కూడా. కాని ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయి.
రాత్రి 9 గంటల తరువాత రోడ్లపై కన్పించే మహిళలందరూ వేశ్యలేనని, వారి అత్యాచారం చేసినా, హత్య చేసినా తప్పేమి కాదని ముస్లిం మత పెద్ద స్వాలి బాత్రే (27)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011లో రాష్ట్రంలో జరిగిన ఒక రేప్ ను సమర్థిస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2011లో గోవింద స్వామి అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఐదు రోజుల తరువాత చికిత్స పొందుతూ బాలిక మరణించడంతో విచారణ తరువాత జిల్లా కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఆ తరువాత అతను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటనపై స్వాలి బాత్రే తాజాగా స్పందించారు. రాత్రిపూట తిరిగేవారు వేశ్యలు కాబట్టే, గోవింద స్వామికి చిక్కింది. అందులో ఆయన తప్పేమి లేదు. రాత్రి వేళల్లో బయట తిరిగే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం తప్పు కాదని సమర్థించారు.