23న తెరుచుకోనున్న సినిమా హాళ్లు
హైదరాబాద్: సినిమా ప్రేక్షకులకు తీపి కబురు అందించారు. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు ఈ నెల 23న తెరుచుకోనున్నాయి.
థియేటర్లు తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీ మోహన్, సెక్రటరీ సునిల్ నారంగ్ తెలిపారు.
ఫిల్మ్ ఎగ్జిబిటర్లను అత్యవసర సమావేశం పెట్టి థియేటర్ల ఓపెనింగ్ పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బంది రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను కోరారు. అంతకు ముందు రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి టి.శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యారు. థియేటర్లు తిరిగి తెరుస్తున్నామని, సహకరించాలని కోరారు.