ఇన్ స్టాగ్రామ్ లో మోసపోయిన యువతి

హైదరాబాద్: ఈ మధ్య యువతులు ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా స్నేహం ఎక్కువగా చేస్తున్నారు. తమతో పాటు చదువుకున్నవారు, తమ ఇరుగుపొరుగు వారి కన్నా ఇతరులనే నమ్మి నిండా ఆర్థికంగా నష్టపోతున్నారు.
చాదర్ ఘాట్ కు చెందిన యువతి నయనలోనా కు ఇన్ స్టాగ్రామ్ లో మైఖేల్ ప్రాంక్లిన్ పరిచయం అయ్యాడు.

ఇద్దరి మధ్య స్నేహం కుదరి ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు కా. తమ ప్రేమకు గుర్తుగా ఖరీదైన గిఫ్ట్ ను పంపిస్తున్నానని, ఏయిర్ కొరియర్ లో తీసుకోవాలని మైఖేల్ సూచించడంతో నయనలోనా మురిసిపోయింది. రెండు రోజుల తరువాత ఆమెకు ఏయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ ఆఫీసర్లం మాట్లాడుతున్నామని చెప్పారు. కస్టమ్స్ టాక్స్ రూ.2 లక్షలు చెల్లిస్తే మీకు గిఫ్ట్ పంపిస్తామని చెప్పడంతో, అంత సొమ్ములు లేవని రూ.1.20 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేసింది. రెండు రోజులు దాటినా గిఫ్ట్ రాకపోవడంతో గాబరా పడి మైఖేల్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా కూడా బ్లాక్ కావడంతో మోసపోయానని గమనించి సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో నయనలోనా ఫిర్యాదు చేసింది.

Leave A Reply

Your email address will not be published.