హిందీలో ఛత్రపతి రీమేక్… హీరోగా శ్రీనివాస్
దశాబ్ధంన్నర క్రితం తెలుగులో ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఛత్రపతి సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించి పవర్ ఫుల్ డైలాగ్ లతో మెప్పించారు.
ఈ చిత్రాన్ని 16 ఏళ్ల తరువాత హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రం ద్వారీ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఛాలెంజింగ్ గా తీసుకుని కష్టపడుతున్న శ్రీనివాస్ ఈ చిత్రంతో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం మువీ పూజా కార్యక్రమాలకు దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దంపతులు, వివి. వినాయక్, హీరో సాయి శ్రీనివాస్ హాజరయ్యారు. రాజమౌళి క్లాఫ్ కొట్టగా, రమా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ ఏఎం రత్నం డైరెక్ట్ చేయగా, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు.