కెసిఆర్ జిల్లాలో టిఆర్ఎస్ కౌన్సిలర్లు జంప్

సిద్దిపేట: సిఎం కెసిఆర్ సొంత జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బిగ్ షాక్ ఇచ్చాడు. దుబ్బాక మున్సిపాలిటీ లో ముగ్గురు సిట్టింగ్ టిఆర్ఎస్ కౌన్సిలర్లను బిజెపిలో చేరారు.
ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

ఎమ్మెల్యే రఘునందన్ నేతృత్వంలో దుబ్బాక లో అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. టిఆర్ఎస్ దుబ్బాక ను కావాలని టార్గెట్ చేయడం తగదని వారన్నారు. కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్ బిజెపిలో చేరారు. దుబ్బాక నే కాదు తెలంగాణ సమాజం మొత్తం కూడా బిజెపి వైపు చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.