ఈటల హత్యకు కుట్ర చేయలేదు: మంత్రి గంగుల
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేసినట్లు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.
తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా ఈటలను కాపడతానని అన్నారు. ఈటల రాజేందర్ హత్యకు తాను కుట్ర చేసినట్లు ఆయన ఆరోపించడంపై గంగుల కమలాకర్ స్పందించారు. వచ్చే ఉప ఎన్నికల్లో సానుభూతి కోసమే ఈ ఆరోపణలు అన్నారు. హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈటల ది పాదయాత్ర కాదని గడియారాలు పంచే యాత్ర అని ఎద్దేవా చేశారు.