జగన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్. జగన్‌ మోహన్ రెడ్డి, వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజు, సిబిఐ లు లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రఘురామ కృష్ణరాజు తరఫున న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. అధికారం ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటీషన్‌ వేసిన తన క్లయింట్ పైనే తప్పుడు కేసులు పెట్టి వేధించారని తెలిపారు. ఈ కేసులో సిబిఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని అన్నారు. రఘురామకు పిటీషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటీషన్‌ వేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు.. రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.