షర్మిల వ్యూహకర్తగా పికె శిష్యురాలు
హైదరాబాద్: రాజకీయ పార్టీ ఇంకా ప్రారంభం కానేలేదు అప్పుడే వైఎస్.షర్మిల రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నది. అది కూడా ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలినే మరి.
తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియ ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యరికం చేసింది. ఇక నుంచి ప్రియ షర్మిలకు ఎలా ప్రసంగించాలి, ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంది. వచ్చే నెల జూలైలో తన తండ్రి జయంతి సందర్భంగా షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నది. ప్రశాంత్ కిశోర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు, ఏపి సిఎం జగన్ కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.