జగన్ ఏలుబడిలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: అనిత

అమరావతి: ఆడబిడ్డలను కాపాడలేని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా? అని ఏపి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.

మహిళలను కాపాడటం చేతగాకుంటే, ఆయన తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో యువతి ఇంట్లోకి చొరబడి దారుణంగా పొడిచిచంపేశారు. అంతటితో ఆగకుండా, ఆమె చున్నీతోనే తిరిగి ఉరేశారన్నారు. నిన్న నెల్లూరు ఘటన, మొన్న కడపలో, అటుమొన్నవిశాఖలో… ఇలా రాష్ట్రంలో రోజుకోచోట ఆడబిడ్డలు బలవుతుంటే, చేతగాని సిఎం ఏంచేస్తున్నాడన్నారు. పోలీసులుకూడా ఈ అసమర్థ సిఎం పాలనలో విధినిర్వహణ మర్చిపోయారా?. జగన్ ఇంటి సమీపంలో పుష్కరఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?. మహిళల మానప్రాణాలు పోతుంటే, లేనిచట్టంముసుగులో దిశాయాప్ పేరుతో హాడావుడి చేయడంతప్ప, ఏంచేస్తున్నాడు?. తను తెచ్చాననిచెప్పుకుంటున్న దిశా చట్టాన్ని కేంద్రంతో ఆమోదింపచేసుకోలేకపోయాడు ఈ ముఖ్యమంత్రి అన్నారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, కేసులగురించి మాట్లాడుకోవడం తప్ప,ఆడబిడ్డల రక్షణకోసంతెచ్చిన చట్టాన్నిఆమోదించమని కోరాడా? అని వంగలపూడి అనిత నిలదీశారు.
సొంతచెల్లికి న్యాయంచేయలేని సీఎం, రాష్ట్రంలోని ఆడబిడ్డలను రక్షిస్తాడా?. హోం మంత్రి సహా, వైసిపిలోని మహిళానేతలంతా భజన మానేసి, బాధ్యతతో ఆలోచనచేయాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆడబిడ్డలరక్షణపై స్పందించకపోతే, టీడీపీ మహిళావిభాగం రోడ్లపైకొచ్చి పోరాటంచేస్తుందని అనిత హెచ్చరించింది.

Leave A Reply

Your email address will not be published.