ఏపి పాజిటివ్ కేసులు 2526
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతునే ఉన్నది. గడచిన 24 గంటల్లో 93,785 నమూనాలను పరీక్షించగా 2,526 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
గత 24 గంటల్లో 24 మరణించగా, ప్రకాశం జిల్లాలోనే ఆరుగురు చనిపోయారని ఏపి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 404 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 25,526 ఉండగా గడచిన 24 గంటల్లో 2933 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,081 మంది చనిపోగా, 19.32 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.