కృష్ణా జలాలపై సుప్రీంలో ఏపి పిటీషన్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల సమస్యపై ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఏపికి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండికొడుతున్నదని పిటీషన్ లో ఆరోపించింది.
తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, తాగు, సాగు జలాలు అందకుండా ఏపి ప్రజల హక్కును హరిస్తోందని తెలిపింది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తున్నదని కోర్టుకు తెలియచేసింది. రాయలసీమ ఎత్తిపోతల పై ఇప్పటికే చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. జలాల అక్రమ తరలింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి) ఇంజనీర్లను తనిఖీ చేయకుండా అడ్డుకుంటున్నదని తెలంగాణ ఆరోపించింది.