చైనాలో మరో వైరస్… వణుకుతున్న ప్రజలు!
బీజింగ్: ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతుండగా చైనా దేశంలో మరో వైరస్ కలకలం మొదలైంది. కరోనా వైరస్ కన్నా ప్రమాదకారి అంటున్నారు. మంకీ బి వైరస్ గా పిలిచే ఈ వైరస్ బారిన పడి ఒక శాస్త్రవేత్త మరణించారు.
కోతులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్త మరణించినట్లు తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వైరస్ సోకిన తరువాత కుదుటపడేందుకు కనీసం ఒక వారం నుంచి మూడు వారాల సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి చంపేస్తుందని అంటున్నారు. దీంతో పాటు విపరీతమైన జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట వస్తుంది. సోకిన తరువాత 80 శాత మంది చనిపోతారని, కేవలం 20 శాతం మంది మాత్రమే బతుకుతారని చెబుతున్నారు.