విద్యార్థులకు బంపర్ ఆఫర్: అమెజాన్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ విద్యార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ తో విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి నుంచే చదువుకుంటున్నారు. టీచర్లు ఆన్ లైన్ లోనే పాఠాలు బోధిస్తున్నారు.
నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న వేళ అమెజాన్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. బ్యాక్ టు కాలేజీ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనున్నది. ఈ సేల్ లో ల్యాప్ టాప్ లు, హెడ్ ఫోన్లు, స్పీకర్లు, ఇతర గ్యాడ్జట్లపై 50 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. ఎంపిక చేసిన గ్యాడ్జెట్లపై విద్యార్థులకు ఎడ్ టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా గ్యాడ్జెట్లు కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తుంది. హెచ్.పి పెవిలియన్ కోర్ ఐ5 ఎలెవంత్ జనరేషన్ ల్యాప్ టాప్ పై రూ.10వేల తగ్గింపుతో రూ.66,940కే విక్రయిస్తున్నది. ల్యాప్ టాప్ లేదా ట్యాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, డిజిటల్ విద్యా, అవిష్కార్ వంటి యాప్ లోని ఆన్ లైన్ కోర్సులపై సుమారు రూ.20వేల వరకు తగ్గింపును ఇస్తున్నారు.