ఇక ఆన్ లైన్ లోనే అడ్మిషన్లు
హైదరాబాద్: తెలంగాణలోని గవర్నమెంటు స్కూళ్లలో ఇక నుంచి ఆన్ లైన్ లోనే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. కొత్తగా స్కూళ్లలో చేరిన వారి వివరాలను స్కూల్ఎడ్యు.తెలంగాణ.గవ్.ఇన్ వెబ్ ఫోర్టల్ లో నమోదు చేస్తున్నది.
పిల్లలు స్కూలుకు రాకుండానే ఆధార్ నెంబర్ ద్వారా 12వ తరగతి వరకు నమోదుకు అవకాశం కల్పించారు. రాష్రంలో 26,065 స్కూళ్లు ఉన్నాయి. వెబ్ ఫోర్టల్ లో వివరాలను నమోదు చేసేందుకు వీలుగా ప్రతి స్కూలు హెడ్ మాస్టర్ కు లాగిన్ ఐడి ఇచ్చారు. 2021-22 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు ఇచ్చేందుకు ఇటీవలే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్ లైన్ అడ్మిషన్లను ఆన్ లైన్ లోకి మార్చేసింది.