పాలిటిక్స్ కు పర్మినెంట్ గుడ్ బై చెప్పిన నటుడు
చెన్నై: ఆరోగ్యం సహకరించకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నటుడు రజనీకాంత్ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవాళ చెన్నైలో రజనీ తన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. మక్కల్ మాండ్రం పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడు పదులు నిండిన రజనీకాంత్ గతేడాది పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో షూటింగ్ కోసం వచ్చిన ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చికిత్స తీసుకున్న తరువాత చెన్నైకి వెళ్లిపోయారు. మళ్లీ అనారోగ్య సమస్యలు తిరగబెట్టడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని అమెరికాకు వెళ్లారు. పూర్తిగా కోలుకున్న తరువాత ఆయన చెన్నై ఇటీవలే చేరుకున్నారు. తన నేతృత్వంలో మక్కల్ మాండ్రం పార్టీని రద్దు చేసి అభిమాన సంఘంగా మార్పు చేస్తున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు.