ఆర్థికంగా చితికిపోలేదంటున్న నటుడు
హైదరాబాద్: తను ఆర్థికంగా చితికిపోయానని, ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సత్యదూరమని నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి స్పష్టం చేశారు.
ఉండడానికి సొంత ఇళ్లు కూడా లేదని, నగర శివారులో అద్దె ఇంట్లో ఉంటున్నాడని ప్రచారం జరుగుతుండడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇటీవల రైతన్న సినిమా ప్రివ్యూ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడిన మాటలను పలువురు ఉదహరిస్తున్నారు. ఆయన తనపై ప్రేమతో మాట్లాడి ఉండవచ్చని, కాని ఆర్థిక ఇబ్బందులు లేవని మరోసారి స్పష్టం చేశారు. స్వేచ్ఛ కోసమే నగర శివారులో ఉంటున్నానని, ఆటో కోసం రోజూ రూ.1వేయి వరకు ఖర్చు చేస్తున్నాన్నారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాల ప్రచారం చేయవద్దని నారాయణ మూర్తి కోరారు.