పడవ మునక… 9మంది జాలర్లు మృతి
కొలకతా: దక్షిణ పరగణాల జిల్లాలో చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది జాలర్లు చనిపోయారు. ఈ ప్రమాదంలో ట్రాలర్ డెక్ పై ఉన్న ఇద్దరిని మరో బోటులో ఉన్నవారు రక్షించారు.
జమునారాణి లాల్ యాజమాన్యానికి చెందిన ట్రాలర్ ఐదు రోజుజల కింద బంగాళాఖాతంలోకి 12 మంది జాలర్లతో బయలుదేరింది. చేపలు పట్టుకుని తిరిగి వస్తున్న సమయంలో బుధవారం బక్కాలీ తీరంలో రక్తేశ్రవి ద్వీపానికి సమీపంలో అకస్మాత్తుగా అలలు వచ్చాయి. వాటి తాకిడికి ట్రాలర్ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పది మంది జాలర్లు నిద్రలో ఉండడంతో తప్పించుకోలేక మునిగిపోయారు. మునిగిన ట్రాలర్ ను ఇవాళ గుర్తించి, తొమ్మిది మంది మృతదేహాలను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. మరొకరి ఆచూకి దొరక్కపోవడంతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వెహికిల్స్ తో పాటు డ్రోన్ల సాయం గాలింపు చేస్తున్నారు.