భారీ బడ్జెట్ తో 40వ చిత్రం
హీరో సూర్య ప్రధాన పాత్రతో 40వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆయన 40వ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజు చేసేందుకు చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసింది.
ఆకాశం నీ హద్దురా చిత్రంతో భారీ హిట్ అందుకున్న సూర్య తదుపరి చిత్రాలకు సంతకాలు చేసేశారు. అందులో వెబ్ సిరీస్ కూడా ఉంది. నవరస పేరుతో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కు స్టార్ డైర్టెకర్ గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు వెట్రిమారన్ తో వాడివాసల్, పాండిరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. సూర్య జన్మదినం రోజు జూలై 22వ తీ సాయంత్రం 6 గంటలకు 40వ ఫస్ట్ లుక్ ను రిలీజు చేస్తున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.