3 చైనా కంపెనీలపై అమెజాన్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: గిఫ్ట్ కార్డులను ఎరగా వేసి కస్టమర్లతో తప్పుడు రివ్యూలు రాయించుకుంటున్న మూడు చైనా కంపెనీలపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వేటు వేసింది. ఇప్పటికే 16 చైనా బ్రాండ్లను నిషేధించిన అమెజాన్ తాజాగా మూడింటితో 19కి చేరింది.

అమెజాన్ లో తమ కంపెనీల ఉత్పత్తుల గురించి బాగున్నాయంటూ రివ్యూలు రాస్తే ఊహించని గిఫ్టులు ఇస్తామని మూడు కంపెనీలు తమ వెబ్ ఫోర్టల్ లో పెట్టాయి. ఇది చూసిన పలువురు కస్టమర్లు వస్తువులు బాగున్నాయంటూ అమెజాన్ లో రివ్యూలు పెడుతున్నాయి. ఈ విషయం సంస్థ దృష్టిక రావడంతో సమీక్షించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ తీసుకున్న చర్యల కారణంగా మూడు కంపెనీలు పెద్ద ఎత్తున అమ్మకాలను కోల్పోవడంతో పాటు అపఖ్యాతి పాలయ్యాయి. ఇందులో టిక్ టాక్ యాప్ కు చెందిన బైట్ డ్యాన్స్ కూడా ఉండడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.