మాస్క్ ధరించం.. 24 గంటలు విమానం ఆలస్యం!
వాషింగ్టన్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది విద్యార్థులు మాస్క్ ధరించేందుకు నిరాకరించడంతో ఒక విమానం 24 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
అమెరికన్ ఏయిర్ లైన్స్ విమానం సోమవారం అర్థరాత్రి (యుఎస్ టైమ్) షార్లెట్ డగ్లస్ ఏయిర్ పోర్టు నుంచి టెకాఫ్ కు సిద్ధమవుతోంది.
టెక్నికల్ సమస్యలతో అప్పటికే విమానం లేట్ అయ్యింది. బోస్టన్ కు చెందిన విద్యార్థులు మాస్క్ ధరించేందుకు నిరాకరించారు. విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగడం పైలెట్ విమానం టేకాఫ్ చేయకుండా ఆగిపోయారు. ఏయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెప్పినా విద్యార్థులు విన్పించుకోలేదు. మరుసటి రోజు 30 మంది విద్యార్థులు మాస్క్ వేసుకునేందుకు అంగీకరించడంతో 24 గంటల తరువాత విమానం ఆలస్యంగా బయలుదేరింది. మిగతా ప్రయాణీకులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. వీరి కారణంగా మిగతా ప్రయాణీకులకు వసతి, భోజన సదుపాయం సమకూర్చాల్సిన బాధ్యత అమెరికన్ ఏయిర్ లైన్స్ పై పడింది.